అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:01 AM
మండలంలోని తాలాడ గ్రామానికి చెందిన బింగి లక్ష్మణరావు(30) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు.
సంతకవిటి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని తాలాడ గ్రామానికి చెందిన బింగి లక్ష్మణరావు(30) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ ఆర్.గోపాలరావు తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. లక్ష్మణరావు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అధికంగా అప్పులు చేశారు. అయితే అప్పులవాళ్ల బాధ తాళలేక సోమవారం ఆయన గ్రామంలోని ఓ పశువుల శాల లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఆయన భార్య గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.