Share News

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:55 PM

మండలంలోని అక్కివరం సమీపంలో గల జాతీయ రహదారి పక్కన ఆదివారం విద్యుత్‌ స్తంభానికి బూర సూరి బాబు (34) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్‌ఐ సన్యాసి నాయుడు తెలిపారు.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

డెంకాడ, జూన్‌15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అక్కివరం సమీపంలో గల జాతీయ రహదారి పక్కన ఆదివారం విద్యుత్‌ స్తంభానికి బూర సూరి బాబు (34) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్‌ఐ సన్యాసి నాయుడు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. భోగాపురం మండలం సవరవెల్లి పంచాయతీ రామదాసపేట గ్రామానికి చెందిన సూరిబాబు ప్రైవేట్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా పని చేయడం మానేసి మద్యానికి బానిసయ్యాడు. కుటుంబం బాగోగులపై దృష్టి పెట్టడం మానేశాడు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు మొదల య్యాయి. దాంతో సూరిబాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సుందరపేట ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jun 15 , 2025 | 11:55 PM