భార్య మందలించిందని మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:48 PM
మద్యం తాగొద్దని భార్య మంద లించడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకు న్నాడు.
ఎస్.కోట రూరల్, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): మద్యం తాగొద్దని భార్య మంద లించడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకు న్నాడు. ఈ ఘటన మండలంలోని తలారీ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై సీఐ నారాయణమూర్తి ఆదివారం సాయంత్రం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చలపురెడ్డి కృష్ణ(45) కొద్ది కాలంగా మద్యం తాగడంతోపాటు డబ్బులు వృథా చేస్తున్నాడు. దీంతో భార్య పైడితల్లమ్మ ఈనెల 1వ తేదీన మందలించింది. అయితే అదేరోజు రాత్రి బయటకు వెళ్లిన కృష్ణ కాసే పటి తర్వాత ఇంటికి వచ్చి పడిపోయాడు. ఆ సమయంలో అతని పక్కన గడ్డి మందు డబ్బా ఉండడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎస్.కోట ఆసుపత్రికి త రలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి విశాఖపట్నం లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.