తండ్రి హత్య కేసులో వ్యక్తి అరెస్టు
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:05 AM
మండలంలోని కొండకిండాం గ్రామంలో ఈనెల 23వ తేదీ రాత్రి తన తండ్రిని హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ యు.మహేష్ తెలిపారు.
బొండపల్లి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండకిండాం గ్రామంలో ఈనెల 23వ తేదీ రాత్రి తన తండ్రిని హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ యు.మహేష్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎస్‌ఐ స్థానిక విలేకర్లకు సోమవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండకిండాం గ్రామానికి చెందిన పెద్దమజ్జి నాయుడుబాబుకు, తన ఏకైక కొడుకు పెదమజ్జి గణేష్‌కుమార్‌కు మధ్య గత కొంతకాలంగా ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. ఈక్రమంలో 23వ తేదీ రాత్రి ఆస్తి విషయమై తండ్రి, కొడుకుల మధ్యన ఘర్షణ జరిగింది. గణేష్‌కుమార్ క్షణికావేశంలో తన తండ్రి నాయుడుబాబుపై ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. దీంతో నాయుడుబాబు మృతిచెందాడు. మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించి గణేష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని, అరెస్టు చేశారు.