Share News

Malaria Symptoms 37 మందికి మలేరియా లక్షణాలు

ABN , Publish Date - Apr 22 , 2025 | 11:57 PM

Malaria Symptoms Found in 37 People సాలూరు మండలం కొత్తవలస పంచాయతీ పరిధి గొందివలసలో 37 మందికి మలేరియా లక్షణాలు ఉన్నట్టు వైద్యసిబ్బంది గుర్తించారు. ఈ గ్రామం నుంచి ఎక్కువమంది జ్వరాలతో మామిడిపల్లి పీహెచ్‌సీకి వస్తుండడంతో వైద్యధికారులు అప్రమత్తమయ్యారు.

Malaria Symptoms   37 మందికి మలేరియా లక్షణాలు
గొందివలసలో రోగులకు మాత్రలు వేస్తున్న వైద్యాధికారి

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 22 ( ఆంధ్రజ్యోతి ): సాలూరు మండలం కొత్తవలస పంచాయతీ పరిధి గొందివలసలో 37 మందికి మలేరియా లక్షణాలు ఉన్నట్టు వైద్యసిబ్బంది గుర్తించారు. ఈ గ్రామం నుంచి ఎక్కువమంది జ్వరాలతో మామిడిపల్లి పీహెచ్‌సీకి వస్తుండడంతో వైద్యధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఆ గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. 86 మందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. వారి నుంచి రక్తనమూనాలు సేకరించి అక్కడక్కడే ఆర్‌డీటీ ( ర్యాపిడ్‌ డయోగ్నోస్టిక్‌ టెస్ట్‌ )చేశారు. కాగా 37 మందికి మలేరియా లక్షణాలున్నట్టు గుర్తించారు. వెంటనే గ్రామ సమీపంలో నిల్వ ఉన్న ఊటనీటిని బయటకు పంపే చర్యలు తీసుకున్నారు. జ్వరాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. 86 మందికి మాస్‌ డ్రగ్స్‌ అడ్మిస్ట్రేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. వారందరికీ మందులు అందించారు. రాత్రివేళల్లో ఎవరికి బాగోలేకపోయినా 108 వాహనం ద్వారా తక్షణం మామిడిపల్లి పీహెచ్‌సీకి తరలించాలని హెల్త్‌ అసిస్టెంట్‌ సన్యాసిరావు, ఏఎన్‌ఎం పార్వతిలను ఆదేశించారు. గ్రామంలో 37 మందికి మలేరియా ఉన్నది లేనిదీ నిర్ధారణకు ఇంకా పూర్తిస్థాయిలో పరీక్షలు చేయాల్సి ఉందని, ప్రస్తుతం వారికి ఆర్డీటీలో పాజిటివ్‌గా గుర్తించామని పీహెచ్‌సీ వైద్యాధికారి శివకుమార్‌ చెప్పారు.

Updated Date - Apr 22 , 2025 | 11:57 PM