Share News

జాబ్‌చార్ట్‌ అనంతరమే బదిలీలు చేయండి

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:03 AM

తమకు స్పష్ట మైన జాబ్‌చార్ట్‌ ఇచ్చిన తర్వాతే బదిలీలను నిర్వహించా లని ఉమ్మడి జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యో గులు కోరుతున్నారు.

జాబ్‌చార్ట్‌ అనంతరమే బదిలీలు చేయండి
ఎంపీడీవోకు వినతిపత్రం ఇస్తున్న సచివాలయ ఉద్యోగులు

  • ఉమ్మడి జిల్లాలో సచివాలయ ఉద్యోగుల ఆందోళన

  • ఎంపీడీవోలకు వినతిపత్రాల సమర్పణ

సాలూరు రూరల్‌/ భామిని/ గరుగుబిల్లి/ కురుపాం/ రామభద్రపురం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): తమకు స్పష్ట మైన జాబ్‌చార్ట్‌ ఇచ్చిన తర్వాతే బదిలీలను నిర్వహించా లని ఉమ్మడి జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యో గులు కోరుతున్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో గల గ్రామ సచివాలయ ఉద్యో గులు మంగళవారం సాయం త్రం తమ పరిధిలోని ఎంపీడీవోలకు వినతిపత్రాలు అందించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతలు కల్పించాలని కోరా రు. ఉద్యోగు లకు రావాల్సిన నోషనల్‌ ఇంక్రిమెంట్లు, బకా యిలు విడుదల చేయాలన్నారు. హేతుబద్దీకరణ ప్రకియ ద్వారా మిగులు సిబ్బందిని ప్రభుత్వం ఏ విధంగా విని యోగించుకుంటుందో స్పష్టత ఇవ్వాలని కోరారు. బదిలీ ప్రక్రియ లో సొంత మండలాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు. బదిలీలకు సీనియారిటీ మెరిట్‌ జాబితాను విడుదల చేసి సజావుగా పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. సాలూరు మండలంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల నేత బిడ్డక సుబ్బారావు ఆధ్వర్యంలో ఎంపీడీవో గొల్లపల్లి పార్వతికి వినతిపత్రం అందించారు. అలాగే కురుపాంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ కె.కార్తీక్‌ వినతిపత్రం అందించారు. వివిధ మండలాల్లో సచివాలయ ఉద్యోగు లు ఎంపీడీవోలకు వినతిపత్రాలు ఇచ్చి, ప్రభుత్వం అనుకూలంగా స్పందించాలని కోరారు. విజయగనం జిల్లా రామభద్రపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు మంగళవారం ప్లకార్డులతో నిరసన తెలిపారు.

Updated Date - Jun 25 , 2025 | 12:03 AM