స్త్రీశక్తి సభను విజయవంతం చేయండి
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:05 AM
పట్టణంలో వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించనున్న స్త్రీశక్తి సభను మహిళలు విజయవంతం చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. ఈ మేరకు శనివారం సభా వేధి క ఏర్పాట్లను పరిశీలించారు.
సాలూరు, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): పట్టణంలో వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించనున్న స్త్రీశక్తి సభను మహిళలు విజయవంతం చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. ఈ మేరకు శనివారం సభా వేధి క ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు ఆగస్టు 15నుంచి మహిళలకోసం ఉచిత బస్సు పథకం ప్రవే శపెట్టడంతో కృతజ్ఞతలు తెలి పేందుకు ఈ సభను నిర్వహిస్తునకనట్లు తెలిపారు.