Impressive! ఆకట్టుకునేలా!
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:41 PM
Make It Impressive! తోటపల్లి ప్రాజెక్టు పరిధి కుడి మట్టికట్ట దిగువ ప్రాంతంలో ఉన్న పార్వతీపురం ఐటీడీఏ పార్కు రూపురేఖలు మారుతున్నాయి. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా సుందరీకరణ పనులు చేపడతున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతున్న యంత్రాంగం
గరుగుబిల్లి,నవంబరు17(ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు పరిధి కుడి మట్టికట్ట దిగువ ప్రాంతంలో ఉన్న పార్వతీపురం ఐటీడీఏ పార్కు రూపురేఖలు మారుతున్నాయి. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా సుందరీకరణ పనులు చేపడతున్నారు. వాస్తవంగా గత ఐదేళ్లూ అధ్వాన స్థితిలో ఉన్న పార్కుపై కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో దృష్టి సారించారు. దాని అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. దీంతో ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు ముమ్మరంగా పనులు చేపడుతున్నారు. పార్కు ప్రధాన ముఖ ద్వారం సందర్శకులను ఆకట్టుకునేలా చర్యలు చేపట్టారు. గతంలో ఇక్కడ ఏర్పాటు చేసిన పలు రకాల బొమ్మలకు రంగులు వేయించారు. చిన్నారులు ఆడుకునే పరికరాలను మరమ్మతులు చేయించారు. వెదురుతో తయారు చేసిన పలు రకాల సామగ్రి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్కు ప్రాంతంలో విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలతో పాటు దుకాణ సముదా యాలు ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాజెక్టు వైపు వెళ్లే మెట్లు మార్గాన్ని ఆకర్షణగా తీర్చిదిద్దుతున్నారు. రోప్‌ల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నారు. మొత్తంగా సుంకి ప్రధాన మార్గం నుంచి పాలకొండ-శ్రీకాకుళం వైపు వెళ్లే వారికి ఐటీడీఏ పార్కు ప్రత్యేక ఆకర్షణగా దర్శన మిస్తోంది. ‘మరో పది రోజుల్లో పార్కులో అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నాం. కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఆదేశాల మేరకు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా చర్యలు చేపడుతున్నాం.’ అని ఐటీడీఏ జేఈ తిరుపతిరావుత తెలిపారు.