Share News

అయ్యప్పస్వామి పూజలకు ఏర్పాట్లు చేయండి

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:54 PM

గజపతినగరం వ్యవశాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో గురువారం నిర్వహించనున్న శ్రీపూర్ణపుష్కలాంబసమేత హరి హరసుత అయ్యప్పస్వామి విశేష పూజలకు ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు.ఈ మేరకు బుధవారం పూజా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

  అయ్యప్పస్వామి పూజలకు ఏర్పాట్లు చేయండి
ఏర్పాట్లపై సూచనలిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ :

గజపతినగరం, నవంబరు5 (ఆంధ్రజ్యోతి): గజపతినగరం వ్యవశాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో గురువారం నిర్వహించనున్న శ్రీపూర్ణపుష్కలాంబసమేత హరి హరసుత అయ్యప్పస్వామి విశేష పూజలకు ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు.ఈ మేరకు బుధవారం పూజా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి మండలాలతో పాటు మెంటాడ మండలం నుంచి పది వేల మందివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేయా లని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ పీవీవీ గోపాలరాజు, పీఏసీఎస్‌ చైర్మన్‌ లెంక బంగారునాయుడు, రామ్‌కుమార్‌, ప్రదీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 11:54 PM