అదుపు తప్పి.. తుప్పల్లోకి దూసుకువెళ్లి
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:27 AM
: మండలంలోని కె.గుమ్మడ సమీపంలో శనివారం పెనుప్రమాదం తప్పింది. పాలకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అంటికొండ నుంచి పాలకొండ వైపు వస్తోంది. కె.గుమ్మడ గ్రామ సమీ పంలోగల మలుపు వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు అదుపు తప్పి తుప్పల్లోకి దూసుకువెళ్లింది.
సీతంపేట రూరల్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యో తి): మండలంలోని కె.గుమ్మడ సమీపంలో శనివారం పెనుప్రమాదం తప్పింది. పాలకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అంటికొండ నుంచి పాలకొండ వైపు వస్తోంది. కె.గుమ్మడ గ్రామ సమీ పంలోగల మలుపు వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు అదుపు తప్పి తుప్పల్లోకి దూసుకువెళ్లింది. ఆ సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సులు నిలిపివేశాడు. ఆ సమయంలో బస్సులో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోడంతోఅందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత బస్సును బయటకు తీసి డిపోకు తరలించారు.