Share News

సివిల్‌ సర్వీస్‌ రూల్స్‌ సవరణతో నష్టం

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:03 AM

కేంద్ర సివిల్‌ సర్వీస్‌ సెక్షన్‌ రూల్స్‌ -1972ను సవరణ చేస్తూ కేంద్ర బడ్జెట్‌లో పొందుపరిచిన అంశానికి గత నెల 29న గజిట్‌ పబ్లికేషన్‌ చేయడం ఎంతో కలవర పరిచే అంశమని పెన్షనర్ల సంఘం రాష్ట్ర నాయకుడు రౌతు రామ్మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

సివిల్‌ సర్వీస్‌ రూల్స్‌ సవరణతో నష్టం

బొబ్బిలి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సివిల్‌ సర్వీస్‌ సెక్షన్‌ రూల్స్‌ -1972ను సవరణ చేస్తూ కేంద్ర బడ్జెట్‌లో పొందుపరిచిన అంశానికి గత నెల 29న గజిట్‌ పబ్లికేషన్‌ చేయడం ఎంతో కలవర పరిచే అంశమని, దీంతో రిటైర్డ్‌ ఉద్యోగుల కు పెనునష్టం జరుగుతుందని ఆ సంఘం రాష్ట్ర నాయకుడు రౌతు రామ్మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసి యేషన్‌ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే పే రివిజన్‌ కమిషన్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్‌ అయిన వారికి కూడా పెన్షన్‌ పెరుగుతుందన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణ ప్రభా వంగా ఇకమీదట అలాంటి వెసులుబాటును తామంతా కోల్పోతామని, ఇది తీవ్రమైన బాధాకర అంశమని అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు మానవతతో స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నా మన్నారు. త్వరలో చంద్రబాబును కలిసి మెమొరాండం అందజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు ఎల్‌.జగన్నాథం, ఎంకేఎం నాయుడు, బొత్స సత్యనారాయణ, సీహెచ్‌ శ్రీరామ్మూర్తి, బెవర రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:03 AM