లారీ బోల్తా.. క్లీనర్ మృతి
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:16 AM
మండలంలోని ముగడవలస వద్ద ఆదివారం లారీ బోల్తాపడడంతో సాలూరుకు చెందిన క్లీనర్ మృతిచెందా డు.
సాలూరు రూరల్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ముగడవలస వద్ద ఆదివారం లారీ బోల్తాపడడంతో సాలూరుకు చెందిన క్లీనర్ మృతిచెందా డు. పోలీసులు, స్థానికు కథనం మేరకు.. సీతందొరవలస నుంచి కర్రల లోడుతో రాయగడ జేకే పేపర్‌మిల్స్‌కు లారీ వెళ్తోంది. ఈ లారీ ముగడవలస సమీపంలో అదుపుతప్పి బోల్తా పడడంతో క్లీనర్ మేడిశెట్టి వెంకటరమణ (37) క్యాబిన్ కింద ఇరుక్కుపోయి అక్కడికక్కడే మరణించాడు. వెంకటరమణ తండ్రి తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ నర్సింహమూర్తి కేసు నమోదు చేశారు. ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు శవమై కనిపించడంతో తండ్రి తాత, తల్లి రాములమ్మ రోదనలు మిన్నంటాయి. తాత దంపతుల రెండో కొడుకు తిరుపతి సైతం లారీ ప్రమాదంలో మృతిచెందిన విషయం విదితమే. ఇద్దరు కుమారులు కూడా మృతిచెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.