Cotton Sales పత్తి విక్రయాలకు పడిగాపులు
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:54 PM
Long Wait for Cotton Sales మండల కేంద్రంలో సీసీఐ ద్వారా పత్తి విక్రయాలకు అవస్థలు తప్పడం లేదు. సోమవారం అధికారులు, సిబ్బంది ఆలస్యంగా రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తూకవ కోసం క్యూ కట్టిన వాహనాలు
భామిని, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో సీసీఐ ద్వారా పత్తి విక్రయాలకు అవస్థలు తప్పడం లేదు. సోమవారం అధికారులు, సిబ్బంది ఆలస్యంగా రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శని, ఆదివారం సెలవులు కావడంతో పత్తి విక్రయాలకు చాలామంది సోమవారం స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ మేరకు వేకువజామునే సీసీఐ కేంద్రానికి వాహనాలతో చేరుకున్నారు. అయితే ఎంతకీ సిబ్బంది రాకపోవడంతో గంటల తరబడి రైతులు నిరీక్షించాల్సి వచ్చింది. తూకవ కేంద్రం బయట పడిగాపులు కాశారు. ఫోన్ల ద్వారా పాలకొండ మార్కెట్ కమిటీ సిబ్బందిని సంప్రదించారు. చివరకు మధ్యాహ్నం 12.30 గంటలకు సిబ్బంది రావడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. క్రిస్మస్, సంక్రాంతి సమీపిస్తుండడంతో విక్రయించిన పత్తి సొమ్మును త్వరగా జమ చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా పాలకొండలో జేడీ సమావేశానికి వెళ్లడం వల్ల ఆలస్యమైందని మరోవైపు ఏఎంసీ సిబ్బంది తెలిపారు.