Share News

లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:31 PM

వచ్చే నెల 13న జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల న్యాయసేవాసంస్థ అధ్యక్షురాలు, సీనియర్‌ న్యాయాధికారి కె.శారదాంబ పిలుపునిచ్చారు.

 లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలి
అధికారులకు సూచనలిస్తున్న సీనియర్‌ న్యాయాధికారి శారదాంబ

- సీనియర్‌ న్యాయాధికారి శారదాంబ

రాజాం రూరల్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 13న జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల న్యాయసేవాసంస్థ అధ్యక్షురాలు, సీనియర్‌ న్యాయాధికారి కె.శారదాంబ పిలుపునిచ్చారు. కోర్టుప్రాంగణంలో న్యాయవాదులు, పోలీసు, రెవెన్యూ, బ్యాంకర్లు, చిట్‌ఫండ్‌ కంపెనీల స్టాండింగ్‌ కౌన్సిల్స్‌, మున్సిపాలిటీ, ఎక్సైజ్‌ అధికారులు, జూనియర్‌ న్యాయాధికారి కె.నైమిషతో కలిసి శనివారం సమావేశమయ్యారు. అదాలత్‌లో రాజీకి అనుకూలమైన క్రిమినల్‌, సివిల్‌, ప్రీ లిటిగేషన్‌ కేసుల్ని పరిష్కరించుకోవచ్చని సూచించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదాలత్‌ విజయవంతానికి అన్నిశాఖల అధికారులు సహక రించాలని కోరారు. అదాలత్‌లో ఇచ్చిన తీర్పు అంతిమతీర్పుగా న్యాయాధికారి స్పష్టం చేశారు. సివిల్‌ కేసులు అదాలత్‌లో పరిష్కారం చేసుకుంటే కోర్టుఫీజు కూడా వాపస్‌ ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో రాజాం తహసీల్దార్‌ రాజశేఖర్‌, రాజాం, సంతకవిటి ఎస్‌ఐలు రవికిరణ్‌, గోపాలరావు, ఎక్సైజ్‌ ఎస్‌ఐలు మాన్యాలు, మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:31 PM