Lok Adalat వచ్చేనెల 13న లోక్ అదాలత్
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:10 AM
Lok Adalat on the 13th of Next Month జిల్లాలో వచ్చేనెల 13న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎస్.దామోదరరావు తెలిపారు. శనివారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీస్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
బెలగాం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వచ్చేనెల 13న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎస్.దామోదరరావు తెలిపారు. శనివారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీస్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్‌కు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడు తుందని తెలిపారు. రాజీ మార్గం ఉత్తమమైనదని, దీనివల్ల ఇరు పక్షాల కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతుందని చెప్పారు. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్నారు. కోర్టుకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా కేసులు రాజీ చేసుకోవచ్చని వెల్లడించారు. లోక్ అదాలత్‌లో బాధితులకు సత్వర న్యాయం అందుతుందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐలు, ఎస్‌లు తదితరులు పాల్గొన్నారు.