కార్పొరేషన్ల ద్వారా త్వరలో రుణాలు
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:56 PM
త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తుందని, వాటిని ఆయా కేటగిరిల వారీ ప్రజలు వినియోగించుకోవాలని శృంగవ రపుకోట ఎమ్మెల్యే లలితకుమారి కోరారు.
లక్కవరపుకోట, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తుందని, వాటిని ఆయా కేటగిరిల వారీ ప్రజలు వినియోగించుకోవాలని శృంగవ రపుకోట ఎమ్మెల్యే లలితకుమారి కోరారు. బుధవారం లక్కవరపు కోటలో పీఎంఈజీపీ ద్వారా చిన గుడిపాల, చామలాపల్లి, కొండ గంగుబూడి గ్రామాలకు చెందిన ముగ్గురికిమంజూరైన ఆటోలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సబ్సిడీ రుణాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్య క్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, జి.దేముడు, చల్లా వెంకటరావు, నిరుజోగి అమ్మతల్లినాయుడు పాల్గొన్నారు.