Share News

Tenant Farmers కౌలు రైతులకు రుణాలు అందించాలి

ABN , Publish Date - May 26 , 2025 | 10:55 PM

Loans Should Be Provided to Tenant Farmers కౌలు రైతులకు రుణాలు అందించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. వ్యవసాయశాఖ, అనుబంధ శాఖలతో సోమవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

  Tenant Farmers  కౌలు రైతులకు రుణాలు అందించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, మే 26 (ఆంధ్రజ్యోతి): కౌలు రైతులకు రుణాలు అందించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. వ్యవసాయశాఖ, అనుబంధ శాఖలతో సోమవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ జిల్లాలో 11 వేల మందికి సీసీఆర్‌ కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ఏడాది 9,500 వరకు కార్డులు జారీ చేశాం. గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ సహాయకులు సమన్వయంతో పనిచేసి కౌలు రైతులను గుర్తించాలి. సీసీఆర్‌ కార్డుల జారీ అనంతరం రుణాలు అందించాలి. అవసరమైతే గ్రూప్‌లు ఏర్పాటు చేయాలి. 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి రేషన్‌కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలి. సీతంపేట, మక్కువ తదితర మండలాల్లో ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయి. తక్షణం వాటిపై చర్యలు తీసుకోవాలి. జూన్‌ ఒకటో తేదీ నుంచి అమలు కానున్న ‘అన్నదాత సుఖీభవ’కు సంబంధించి రైతుల ఆధార్‌ అనుసంధానం పూర్తిచేయాలి. పట్టాదారు పాస్‌పుస్తకం కలిగి వెబ్‌ల్యాండ్‌లో వివరాలు నమోదు కాకపోవడం, లేదా వివరాలు సక్రమంగా లేకపోవడం వంటి వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలి.’ అని ఆయన తెలిపారు.

వీఆర్‌వోలు ప్రధాన కేంద్రాల్లో ఉండాలి

జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపఽథ్యంలో గ్రామ రెవెన్యూ అధికారులు ప్రధాన కేంద్రాల్లో ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎప్పటికప్పుడు జిల్లా కేం ద్రానికి సమాచారం అందించాలని తెలిపారు. రేషన్‌కార్డులు, సీసీఆర్‌సీ జారీ, ఆధార్‌ అనుసంధా నం వంటి అంశాలను పర్యవేక్షించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ ఎస్‌.ఎస్‌.శోభిక, పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు ఐటీడీఏ అశుతోష్‌ శ్రీవాత్సవ, యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో కె.హేమలత తదితరులు ఉన్నారు.

Updated Date - May 26 , 2025 | 10:55 PM