Women’s Fund స్త్రీ నిధితో జీవనోపాధికి బాటలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:49 AM
Livelihood Opportunities through Women’s Fund స్త్రీ నిధి బ్యాంక్‌ను స్వయం సహాయక సంఘాలు వినియోగించుకుని జీవనోపాధులకు బాటలు వేసుకోవాలని సెర్ప్ రాష్ట్ర అడిషనల్ సీఈవో కె.శ్రీరాములునాయుడు సూచించారు. పందిరి మామిడివలసలో అప్పులు, జీవనోపాధులపై శనివారం నిర్వహించిన సర్వేను పరిశీలించారు.

సాలూరు రూరల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి ): స్త్రీ నిధి బ్యాంక్‌ను స్వయం సహాయక సంఘాలు వినియోగించుకుని జీవనోపాధులకు బాటలు వేసుకోవాలని సెర్ప్ రాష్ట్ర అడిషనల్ సీఈవో కె.శ్రీరాములునాయుడు సూచించారు. పందిరి మామిడివలసలో అప్పులు, జీవనోపాధులపై శనివారం నిర్వహించిన సర్వేను పరిశీలించారు. అనంతరం ఆ గ్రామ మహిళలతో సమావేశ మయ్యారు. స్త్రీ నిధి బ్యాంక్‌లో డిపాజిట్లు చేసుకోవచ్చని, తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చని తెలిపారు. ఎస్‌హెచ్‌జీలు అంతర్గత రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు గతంలో తీసుకున్న రుణాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నారో తెలుసుకోవడానికే సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియను ఎన్యూమరేటర్లు పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట డీఆర్‌డీఏ పీడీ సుధారాణి తదితరులు ఉన్నారు.