మంత్రి దృష్టికి లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:13 AM
లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య మరోసారి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దృష్టికి వెళ్లింది.

జియ్యమ్మవలస, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య మరోసారి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దృష్టికి వెళ్లింది. శుక్రవారం గుమ్మలక్ష్మీపురం మండల పర్యటనకు వెళ్లిన ఆమెకు గరుగుబిల్లి మండలం గిజబ జంక్షన్ వద్ద టీడీపీ ప్రతినిధులు డొంకాడ రామకృష్ణ, మరడాన తవిటినాయుడు ఆధ్వర్యంలో రైతులు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అలాగే జియ్యమ్మవలస మండలంలో చింతల బెలగాం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని పలువురు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.