పల్లెల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దాం
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:49 PM
పల్లెల అభివృ ద్ధికి అందరం కలిసికట్టుగా పని చేద్దామని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ఫ్, ఎన్‌ఆర్‌ఐ సాధికార సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
బొండపల్లి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృ ద్ధికి అందరం కలిసికట్టుగా పని చేద్దామని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ఫ్, ఎన్‌ఆర్‌ఐ సాధికార సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మండలం లోని బొండపల్లి-1, అంబటివలస సచివాలయ భవనాల ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాలపై వివరించారు. భోగస్ పింఛన్ల పరిశీలనకు ప్రభుత్వం చర్యలు చేపట్టిం దని, ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఈ విషయం ప్రజలు గుర్తెరిగి అవగాహన పొందాలని సూచించారు. రాష్ట్రంలో 63 లక్షల 71 వేల మందికి పలు రకాల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం అంబటివలస లో భవనాన్ని ప్రారంభిం చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ పరిధిలో జీడిపిక్కల ప్రోససింగ్ ప్రాజెక్టు నెలకొల్పేందు కు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని అన్నారు. పారిశ్రామిక వాడ అభివృద్ధికి 50 ఎకరాల స్థల సేకరించారని, ఈ పరిశ్రమల ద్వారా సుమారు వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు పీవీవీ.గోపాలరాజు, కోరా డ కృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు రాపాక అచ్చంనా యుడు, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ముంజే టి పార్వతి, బొండపల్లి, గొట్లాం పీఏసీఎస్ అధ్యక్షులు బుద్ధరాజు బుచ్చిరాజు, సిడగాం శ్రీనివాస్, తహసీల్దార్ డోలా రాజేశ్వరరావు, ఇన్‌చార్జ్ ఎంపీడీవో రఘుపతి రావులతోపాటు పలు గ్రామాల సర్పంచ్‌లు నంబూరి రాజేష్, ఈదుబిల్లి కృష్ణ, బొండపల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.