అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దాం
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:47 PM
గ్రామాల్లో అభివృద్ధి సాధించేలా సమన్వయంతో కృషి చేసేందుకు ప్రతిఒక్కరూ పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులు పిలుపునిచ్చారు.
బొండపల్లి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో అభివృద్ధి సాధించేలా సమన్వయంతో కృషి చేసేందుకు ప్రతిఒక్కరూ పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులు పిలుపునిచ్చారు. మండలంలోని కనిమెరక గ్రామ సమీపాన టీడీపీ మండల అధ్యక్షుడు రాపాక అచ్చంనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం టీడీపీ అధికారం చేపట్టినప్పటికీ ఆర్థిక ఆసరా కానరాకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయలేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పటిష్టపరిచేలా క్షేత్రస్థాయి కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ అల్లు విజయ్‌కుమార్, మరువాడ, గొట్లాం క్లస్టర్ కోఆర్డినేటర్లు డోకుల శ్రీను, నంబూరి రాజేష్, గజపతినగరం, గంట్యాడ, దత్తిరాజేరు మండల పార్టీ అధ్యక్షులు గంట్యాడ శ్రీదేవి, బొండపల్లి భాస్కర్‌నాయుడు, చప్పా చంద్రశేఖర్‌లతోపాటు బోడసింగిపేట, సీటీపల్లి, రయింద్రం, బి.రాజేరు సర్పంచ్‌లు మీసాల జానకిరావు, నడుపూరి భాస్కర్‌నాయుడు, ముదునూరి శ్రీనివాసరాజు, ఈదుబిల్లి కృష్ణ పాల్గొన్నారు.