ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం
ABN , Publish Date - May 21 , 2025 | 12:03 AM
‘ప్రభు త్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే మన ప్రధాన కర్తవ్యం’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
మినీ మహానాడులో నాయకులు, కార్యకర్తలతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
సాలూరు, మే 20 (ఆంధ్రజ్యోతి): ‘ప్రభు త్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే మన ప్రధాన కర్తవ్యం’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని అన్నారు. కార్యకర్తలు మరింత చొరవతో పని చేయాలన్నారు. పార్టీ బలోపేతానికి అనుస రించాల్సిన వాటిపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖీ సూర్యనారాయణ, నాయకులు గుళ్ల వేణుగో పాలనాయుడు, వెంకటరమణ, గుడేపు యుగంధర్, ఆముదాల పరమేష్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మహానాడు సభ నిర్వహణ
కమిటీలో సంధ్యారాణికి స్థానం
పార్వతీపురం, మే 20 (ఆంధ్రజ్యోతి): ఈ నెలలో నిర్వహించనున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి సంబంఽధించి వివిధ విభాగా లకు కమిటీల నియామకం అధిష్టానం చేపట్టింది. ఇందులో భాగంగా కీలకమైన సభ నిర్వహణ కమిటీలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి చోటుదక్కింది. దీంతో జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.