Share News

విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేసుకుందాం

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:39 PM

రాష్ట్రంలోని అన్ని విఽధాలుగా వెనుకబడి ఉన్న తమ సంఘాన్ని బలోపేతం చేసుకుం దామని విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.హనుమంతు రావు అన్నారు.

విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేసుకుందాం

పార్వతీపురంటౌన్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని విఽధాలుగా వెనుకబడి ఉన్న తమ సంఘాన్ని బలోపేతం చేసుకుం దామని విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.హనుమంతు రావు అన్నారు. పట్టణంలోని బైపాస్‌ రహదారిలో గల ఆ సంఘ భవనంలో ఆదివారం జరిగిన జిల్లా విశ్వబ్రాహ్మణ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అవుతున్నా ప్రభుత్వాలు తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నా యే తప్పా న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల మందికి పైగా విశ్వబ్రహ్మణులు ఉన్నప్పటికి కనీ సం గుర్తించే వారే కరువయ్యారన్నారు. 2 నెలల్లోగా 27 జిల్లాల్లో ఉన్న విశ్వబ్రహ్మణ జనగణనకు సంబంధించి సంఘ సభ్యులే బాధ్యత తీసుకోవాలన్నారు. విశ్వబ్రహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ నూతన కార్య వర్గం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కె.గౌరీశ్వరరా వు, ఉద్యోగ సంఘ అధ్యక్షుడు పి.వీరాచారి, జిల్లా నాయ కులు బి.శంకరరావు, ఎం.సందీప్‌, సీహెచ్‌.తవిటిరాజు, పి.గౌరీశంకరరావు, జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:39 PM