Share News

సైనిక కుటుంబాలకు అండగా నిలుద్దాం

ABN , Publish Date - May 13 , 2025 | 12:22 AM

Let's stand by the military families దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనిక కుటుంబాలకు అండగా నిలుద్దామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో ప్రాణాలు కోల్పోయిన అమరులైన భారత సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జిల్లా పోలీసుశాఖ సోమవారం సాయంత్రం చేపట్టిన క్యాండిల్‌ ర్యాలీని అనిత ప్రారంభించారు.

సైనిక కుటుంబాలకు అండగా నిలుద్దాం
కొవ్వొత్తుల ర్యాలీలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్‌

సైనిక కుటుంబాలకు అండగా నిలుద్దాం

హోంమంత్రి అనిత

విజయనగరం క్రైం, మే 12(ఆంధ్రజ్యోతి): దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనిక కుటుంబాలకు అండగా నిలుద్దామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో ప్రాణాలు కోల్పోయిన అమరులైన భారత సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జిల్లా పోలీసుశాఖ సోమవారం సాయంత్రం చేపట్టిన క్యాండిల్‌ ర్యాలీని అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టూరిస్ట్‌లపై తీవ్రవాదులు దాడి చేసి 26 మందిని వారి కుటుంబ సభ్యుల ముందే హతమార్చడం హేయమైన చర్య అన్నారు. దీనికి ప్రతిగా భారత ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌కు పిలుపునిచ్చిందని, పాకిస్థాన్‌ ప్రజలపై కాని, సైన్యంపై కాని భారత సైన్యం దాడులకు పాల్పడలేదన్నారు. ర్యాలీ పోలీసు కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ కూడలి వరకూ సాగింది. విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, బేబీనాయన, ఎస్పీ వకుల్‌జిందాల్‌, ఏఎస్‌పీలు సౌమ్యలత, నాగేశ్వరరావు, డాక్టరు తిరుమల ప్రసాద్‌, డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 12:22 AM