పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:20 AM
సమా జంలోని ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా మెలిగి పర్యావరణాన్ని పరిరక్షించుకోకుంటే పెనువిపత్తుల నుంచి మానవాళికి ముప్పు తప్పదని ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు.
బొబ్బిలి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): సమా జంలోని ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా మెలిగి పర్యావరణాన్ని పరిరక్షించుకోకుంటే పెనువిపత్తుల నుంచి మానవాళికి ముప్పు తప్పదని ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. స్థానిక రాణిమల్లమ్మదేవి మునిసిపల్ పా ర్కు చెరువు గట్టుపై మొక్కలు నాటారు. కార్య క్రమంలో మునిసిపల్ చైర్మన్ రాం బార్కి శరత్‌బాబు, కమిషనరు లాలం రా మలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు, ము న్సిపల్ సిబ్బందితో బేబీనాయన పర్యావర ణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేయించారు.
మొక్కలు నాటాలి
బలిజిపేట, జూన్ 5(ఆంధ్రజ్యోతి): పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని, దీని కోసం విరివిగా మొక్కలు నాటాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర పిలుపునిచ్చారు. మండలంలోని అరసాడ గ్రామంలో మొక్కలు నాటారు.
పర్యావరణానికి నడుంబిగిద్దాం
రాజాం, జూన్5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరూ నడుం బిగించాలని ఎమ్మెల్యే మురళీమోహన్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పట్టణంలోని గోపాల పురం రోడ్డులో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 90 వేల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. ప్రతీ ఒక్కరూ ఓ మొక్క నాటి దాన్ని సంరక్షించాలన్నారు. అనంతరం స్థాని కులకు గుడ్డ సంచులను పంపిణీ చేశారు.
మొక్కలు నాటిన తోయిక జగదీశ్వరి
కురుపాం రూరల్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి తెలి పారు. తెన్నుఖర్జ గ్రా మంలో అటవీశాఖ, ఎస్ స్వచ్చంధ సంస్థ సం యుక్తంగా ఏర్పాటు చేసిన మొక్కలు మొ క్కలు నాటారు. కార్య క్రమంలో తహసీల్దార్ రమణమ్మ, ఎంపీడీవో ఉమామహేశ్వరి, అటవీ శాఖ అధికారి గోవిందరాజు, షేక్ గౌష్, అంబుడ్స్‌మన్ కొవ్విడి సన్యాశిరాజు పాల్గొన్నారు.
నెల్లిమర్లలో..
నెల్లిమర్ల, జూన్ 5(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎమ్మెల్యే లోకం నాగమాఽదవి అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లిమర్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మొక్కలతోనే మానవ మనుగడ ముడిపడి ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. నెల్లిమర్ల నియోజక వర్గంలో రెండు నగరవనాల అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాన్ నిధులు మంజూరుచేశారన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు చనమల్లు వెంకటరమణ, బంగారు సరోజిని, రవ్వానాని, అప్పికొండ రవికుమార్, మజ్జి రాంబాబు, పాండ్రంకి సత్యనారాయణ, జనా ప్రసాద్, పతివాడ గోవిందరావు, నగర పంచాయతీ కమిషనర్ ఎ.తారక్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.