Share News

Plastic-Free ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:25 AM

Let’s Make Our District Plastic-Free పార్వతీపురం మన్యాన్ని ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. దీనిపై పురపాలక సంఘాలు, పంచాయతీల్లో తీర్మానం చేసి అమలు చేయాలని సూచించారు.

 Plastic-Free ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యాన్ని ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. దీనిపై పురపాలక సంఘాలు, పంచాయతీల్లో తీర్మానం చేసి అమలు చేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ నిషేధంపై బోర్డులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయా లన్నారు. ఎవరైనా దానిని వినియోగించినా.. విక్రయించినా జరిమానా తప్పదని చెప్పారు. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని, ప్రభుత్వ కార్యాల యాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్‌ గవర్నెన్స్‌ను అమల్లోకి తీసుకొచ్చిందని, దీని ద్వారా అన్ని రకాల సేవలను పొందొచ్చని వెల్లడించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా, బాల్య వివాహాల నిర్మూలన వంటి అంశాలపై పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఐటీఈఏ పీవో అశుతోష్‌ శ్రీవాత్సవ, ఇన్‌చార్జి జేసీ హేమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:25 AM