Share News

Manumakonda మనుమకొండను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:27 PM

Let’s Make Manumakonda a Model మనుమకొండను ఆదర్శంగా తీర్చిదిద్దుదామని సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ అన్నారు. మంగళవారం ఆ గ్రామంలో ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య సేవలు, మహిళా సంఘాల పనితీరు, వ్యవసాయంపై ఆరా తీశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 Manumakonda   మనుమకొండను  ఆదర్శంగా తీర్చిదిద్దుదాం
మనుమకొండ గ్రామస్థులతో మాట్లాడుతున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో

భామిని, సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): మనుమకొండను ఆదర్శంగా తీర్చిదిద్దుదామని సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ అన్నారు. మంగళవారం ఆ గ్రామంలో ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య సేవలు, మహిళా సంఘాల పనితీరు, వ్యవసాయంపై ఆరా తీశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇన్‌చార్జి పీవో మాట్లాడుతూ.. గ్రామంలో సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మనుమకొండ సుందరీకరణలో గ్రామస్థులు భాగస్వాములవ్వాలని కోరారు. అనం తరం గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ సెంటర్‌ను పరిశీలించారు. చిన్నారుల ఎత్తు, బరువుకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. క్రమపద్ధతిలో పౌష్టికాహారాన్ని అందించాలని సూచిం చారు. అక్కడి నుంచి నేరుగా బత్తిలి పీహెచ్‌సీకి చేరుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసు కున్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అనంతరం భామిని ఏకలవ్య పాశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాల్లో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఐటీడీఏ ఏపీవో చిన్నబాబు, ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 11:27 PM