Share News

Let’s face any situation ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొందాం

ABN , Publish Date - May 07 , 2025 | 11:56 PM

Let’s face any situation జాతీయ భద్రత రీత్యా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ ఆర్మీ దాడి చేసి ముష్కరులను మట్టుబెట్టిన నేపథ్యంలో బుధవారం కలెక్టర్లు, కేంద్ర, రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Let’s face any situation  ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొందాం
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబునాయుడు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచన

పార్వతీపురం, మే7(ఆంధ్రజ్యోతి): జాతీయ భద్రత రీత్యా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ ఆర్మీ దాడి చేసి ముష్కరులను మట్టుబెట్టిన నేపథ్యంలో బుధవారం కలెక్టర్లు, కేంద్ర, రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ప్రజలు భయబ్రాంతులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. వారికి పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. అన్ని శాఖలు, ముఖ్యంగా భద్రతా దళాలు పూర్తి సన్నద్ధతతో ఉండాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోభిక, ఎస్పీ మాధవరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 11:56 PM