Share News

Sportspersons క్రీడాకారులను ప్రోత్సహిద్దాం

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:43 PM

Let’s Encourage Our Sportspersons మన్యం జిల్లాలో ప్రతిభావంతుల క్రీడాకారులను ప్రోత్సహిం చేందుకు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. పాఠశాల, కళాశాలల స్థాయిల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి ప్రత్యేక క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించడంపై అభినందనలు తెలిపారు.

  Sportspersons  క్రీడాకారులను ప్రోత్సహిద్దాం
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు

  • విశాఖలో రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాల ఏర్పాటుకు చర్యలు

పార్వతీపురం, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లాలో ప్రతిభావంతుల క్రీడాకారులను ప్రోత్సహిం చేందుకు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. పాఠశాల, కళాశాలల స్థాయిల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి ప్రత్యేక క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించడంపై అభినందనలు తెలిపారు. శుక్రవారం విశాఖలో ఉత్తరాంరఽధ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న క్రీడాకారుల అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో కూడా వివిధ క్రీడల్లో రాణిస్తున్న వారికి ప్రోత్సహించాలన్నారు. విశాఖ కేంద్రంగా రాష్ట్రస్థాయిలో స్పోర్ట్స్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మన్యం జిల్లాలో క్రీడాకారులు చురుకైన వారని, క్రీడల్లో వారు రాణిస్తారని చెప్పారు. భామిని పర్యటనలో పలు క్రీడాకారులను చూశామని, వారిపై తనకు నమ్మకం ఉందని తెలిపారు. కాగా గతంలో స్పోర్ట్స్‌ విభాగంలో ఎంపీడీగా పనిచేసిన సమయంలో క్రీడల అభివద్ధికి తీసుకున్న చర్యలను సీఎంకు తెలియజేసినట్లు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు.

సీఎం ఏరియల్‌ సర్వే

విజయనగరం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌ పోర్టు పరిసరాలు, పనుల ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌లో కీలకమైన ప్రాజెక్టుల పురోగతిపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఏరియల్‌ సర్వే నిర్వహించడమే కాకుండా అధికారులతో కూడా మాట్లాడారు. రహదారులు, నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టులు, ఇతర మౌలిక వసతులు, ఎయిర్‌పోర్టులకు కనెక్టవిటీ ఎలా ఉంది? అనే తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇక విశాఖ-రాయ్‌పూర్‌ జాతీయ రహదారి పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది.

Updated Date - Dec 12 , 2025 | 11:43 PM