Liquor సారాను అరికడదాం
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:11 PM
Let’s Curb Liquor నాటుసారాను అరికట్టి కుటుంబాలను కాపాడు కుందామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. మత్తు, మాదక ద్రవ్యాల నియంత్రణపై శనివారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.
పార్వతీపురం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): నాటుసారాను అరికట్టి కుటుంబాలను కాపాడు కుందామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. మత్తు, మాదక ద్రవ్యాల నియంత్రణపై శనివారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ సారాతో ఎంతోమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. పనిచేసే శక్తి లేకవ డంతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అవుతున్నాయి. లక్షల్లో ఖర్చు చేస్తున్నా ఆరోగ్యం మెరుగు కాక మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబాల్లో చిన్నారుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సారాకు దూరం చేయాలి. జీవనోపాధుల కల్పనకు చర్యలు తీసుకోవాలి. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, సరఫరా చేసేవారిని కఠినంగా శిక్షించాలి. అటవీ ప్రాంతం గుండా బస్సులు, ఇతర వాహనాల ద్వారా జరిగే మత్తు పదార్థాల రవాణాను కట్టడి చేయాలి. వాటి వల్ల కలిగే అనర్థాలపై విద్యా సంస్థల్లో అవగాహన కార్య క్రమాలు నిర్వహించాలి.’ అని తెలిపారు. అనంతరం పోలీస్‌శాఖ ద్వారా చేపట్టిన చర్యలను ఎస్పీ మాధవరెడ్డి వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ అంకితా సురాన, డీఎస్పీ ఎం.రాంబాబు, జిల్లా రవాణా అధికారి టి.దుర్గాప్రసాద్, డ్రగ్స్ కంట్రోల్ అధికారి ఆశాషేక్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నత్తల నివారణకు చర్యలు
నత్తల నివారణకు చర్యలు చేపట్టాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యాన, వ్యవసాయ శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉద్యాన, వ్యవసాయ పంటలపై ఆశించి విపరీతమైన నష్టం కలిగిస్తున్న ఆఫ్రికన్ నత్తలను నిర్మూలించే పద్ధతులపై రైతులకు సూచనలు ఇవ్వాలన్నారు. కొమరాడ మండలం గంగరేగువలసలో బొప్పాయి, జామ, పత్తి పంటల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈవీఎం గోదాము తనిఖీ
పార్వతీపురం వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఈవీఎం గోదామును కలెక్టర్ తనిఖీ చేశారు. గోదాముకు వేసిన సీళ్లు, ఈవీఎంల రక్షణ భద్రతలకు సంబంధించి ఏర్పాట్లు పరిశీ లించారు. పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఆర్వో కె.హేమలత, తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌కు సర్వే
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌కు సర్వే చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా పరి శ్రమల పురోగతి, ఎగుమతుల మండలి (డీఐపీఈసీ), ఈవోడీబీ ఔట్ రీచ్ వర్క్‌షాప్‌ను కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, పారిశ్రామికవేత్తలతో ఆయన మాట్లాడుతూ... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్ అనేది ఆయా ప్రాంతాల వార్షిక వ్యాపార సౌలభ్యం సూచిక అన్నారు. ఇది పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడుతుందని తెలిపారు. అనంతరం పారిశ్రామికవేత్తలు తాము పొందిన సేవలను తెలిపారు. ఈ సమా వేశంలో జిల్లా పరిశ్రమల , కార్మిక శాఖ అధికారులు కరుణాకర్, సువర్ణ, రాంబాబు, పరిశ్రమలశాఖ కన్సల్టెంట్ రాజా హర్ష, లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయస్వరూప్ పాల్గొన్నారు.