Share News

Plastic-Free Society ప్లాస్టిక్‌ రహిత సమాజంలో భాగస్వాములవ్వాలి

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:16 PM

Let’s Be Partners in a Plastic-Free Society ప్లాస్టిక్‌ రహిత సమాజంలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలని జిల్లా ప్రత్యేకాధికారి నారాయణభరత్‌గుప్తా పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం పెదబొండపల్లిలో స్వచ్ఛదివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి రెండు రకాల డస్ట్‌ బిన్లను అందించారు.

 Plastic-Free Society ప్లాస్టిక్‌ రహిత సమాజంలో భాగస్వాములవ్వాలి
పెదబొండపల్లిలో పర్యటిస్తున్న ప్రత్యేక అధికారి , కలెక్టర్‌ , ఎమ్మెల్యే తదితరులు

పార్వతీపురం రూరల్‌, జూలై19(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌ రహిత సమాజంలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలని జిల్లా ప్రత్యేకాధికారి నారాయణభరత్‌గుప్తా పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం పెదబొండపల్లిలో స్వచ్ఛదివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి రెండు రకాల డస్ట్‌ బిన్లను అందించారు. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేసేందుకు వాటిని వినియోగించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు. కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ జిల్లాలో ప్లాస్టిక్‌, పాలిథిన్‌ వినియోగానికి స్వస్తిపలకాలి. గుడ్డ సంచులనే వాడాలి. పర్యావరణానికి హానికరం లేని వస్తువులను వినియోగించాలి.’ అని తెలిపారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. అంతకుముందు వారు గ్రామంలో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం, డీఆర్‌డీఏ ఏర్పాటు చేసిన గుడ్డ సంచుల విక్రయ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం పారిశుధ్య కార్మికులను సత్కరించారు. ప్రజలకు గుడ్డ సంచులను పంపిణీ చేశారు.

- జిల్లాలో ప్లాస్టిక్‌ రహిత జీవన సరళిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా ప్రత్యేకాధికారి నారాయణభరత్‌గుప్తా తెలిపారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో ‘ నో ప్లాస్టిక్‌ జోన్‌’ పై పోస్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి గుడ్డ సంచులను అందించారు. ఈ కార్యక్రమంలో జేసీ శోభిక, డీఆర్వో కె.హేమలత, సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ, డీపీవో టి.కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 11:16 PM