Share News

Polio-Free Society పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:18 AM

Let Us Build a Polio-Free Society పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహకరించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాలూరు మున్సిపల్‌ హైస్కూల్‌లో పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు మంత్రి పోలియో చుక్కలు వేశారు.

 Polio-Free Society  పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం
చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, డిసెంబరు21(ఆంధ్రజ్యోతి): పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహకరించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాలూరు మున్సిపల్‌ హైస్కూల్‌లో పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు మంత్రి పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘జిల్లాలో 99,507 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు 905 సెంటర్లను ఏర్పాటు చేశాం. సుమారు 3,600 వైద్య మంది పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలను సెంటర్లకు తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించాలి. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభిస్తాం.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు, డీఐవో విజయమోహన్‌, ఎస్‌ఎల్‌ఆర్‌ ప్రోగ్రాం అధికారి శివకుమార్‌, స్థానిక నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.

91 శాతం పూర్తి: డీఎంహెచ్‌వో

పార్వతీపురం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలిరోజు చేపట్టిన పల్స్‌పోలియో 91 శాతం పూర్తయిందని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. ఈనెల 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి.. మిగిలిన 9 శాతం మంది చిన్నారులకు కూడా పోలియో చుక్కలు వేస్తారన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 12:18 AM