Share News

వచ్చేది తక్కువ.. వదిలేది ఎక్కువ

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:43 PM

తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.

వచ్చేది తక్కువ.. వదిలేది ఎక్కువ
ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసిన దృశ్యం

- తోటపల్లి నుంచి 6,500 క్యూసెక్కుల నీరు విడుదల

గరుగుబిల్లి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. గురువారం పైప్రాంతాల నుంచి 3,200 క్యూసెక్కుల వరద చేరగా, స్పిల్‌వే గేట్ల నుంచి నది దిగువ ప్రాంతాలకు 6,500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. పైనుంచి వచ్చే ప్రవాహం తక్కువగా ఉండగా, విడుదల చేసేది ఎక్కువగా ఉంది. ప్రాజెక్టులో 105 మీటర్ల సామర్థ్యానికి గాను 104.08 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. అలాగే 2.534 టీఎంసీలకు గాను 1.950 టీఎంసీల సామర్థ్యం ఉంది. సాగునీటి అవసరాల నిమిత్తం ప్రధాన కాలువల నుంచి 1,320 క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. వచ్చిన వరద ప్రవాహం కంటే అధికంగా నీటిని విడుదల చేయడంతో వృథాగా సముద్రంలో కలుస్తున్న పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Sep 11 , 2025 | 11:43 PM