Lemon నిమ్మ ధర పైపైకి..
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:53 PM
Lemon Prices Soaring ఏజెన్సీలో గిరిజన రైతులు సేకరించే అటవీ ఉత్పత్తుల్లో నిమ్మ పంట ఒకటి. అయితే గడిచిన కొద్ది వారాలుగా నిమ్మకాయలకు ఆశించిన స్థాయిలో మద్దతు ధర రాలేదు. దీంతో గిరిజన రైతులు ఆవేదన చెందారు. ప్రస్తుతం సీన్ మారింది.
గిరిజన రైతుల్లో ఆనందం
సీతంపేట రూరల్, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో గిరిజన రైతులు సేకరించే అటవీ ఉత్పత్తుల్లో నిమ్మ పంట ఒకటి. అయితే గడిచిన కొద్ది వారాలుగా నిమ్మకాయలకు ఆశించిన స్థాయిలో మద్దతు ధర రాలేదు. దీంతో గిరిజన రైతులు ఆవేదన చెందారు. ప్రస్తుతం సీన్ మారింది. సీతంపేట వారపు సంతలో ఆదివారం నిమ్మకాయలకు డిమాండ్ పెరిగింది. వాటిని కొనేందుకు మైదాన ప్రాంత వ్యాపారులు పోటీ పడ్డారు. గత వారం 45కేజీల నిమ్మకాయల బస్తా ధర రూ.450లు ఉండగా.. నేడు రూ.750కు చేరింది. ఒక్కసారిగా ధర పెరగడంతో గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందనే సంతోషంతో ఇంటిదారి పట్టారు.