న్యాయసేవలను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:10 AM
జిల్లా న్యాయసేవాధికార సంస్థ అందించే సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత సూచించారు. మండలంలోని డి.కొల్లామ్‌లో జాతీయ న్యాయ సేవల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా న్యాయసేవాధికా ర సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు.
డెంకాడ, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లా న్యాయసేవాధికార సంస్థ అందించే సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత సూచించారు. మండలంలోని డి.కొల్లామ్‌లో జాతీయ న్యాయ సేవల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా న్యాయసేవాధికా ర సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా బబిత చట్టాలు, న్యాయసేవాధికార సంస్థ ప్రజలకు అందించే సేవల గురించి వివరించారు. సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తమ సంస్థ అందించే సేవలను వివరించారు. న్యాయసలహాల కోసం తమను సంప్రదించాలని సూచించారు. డీఎస్పీ గోవిందరావు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భోగాపురం రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ సన్యాసినాయుడు, తహసీల్దార్ రాజారావు, ఎంపీడీవో భవాని, సర్పంచ్ అట్టాడ కృష్ణ పాల్గొన్నారు.