Share News

రీసర్వేతో భూ సమస్యల పరిష్కారం: ఆర్డీవో

ABN , Publish Date - Dec 31 , 2025 | 11:59 PM

రీసర్వేకు రైతులంతా సహకరించాలని రెవెన్యూ అధికారులు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాలోని పలు చోట్ల రీసర్వే గ్రామసభలు నిర్వహించి, శుక్రవారం నుంచి జరిగే కార్య క్రమంపై చర్చించారు.

రీసర్వేతో భూ సమస్యల పరిష్కారం: ఆర్డీవో
పిరిడిలో రీసర్వే అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఆర్డీవో రామ్మోహనరావు :

రీసర్వేకు రైతులంతా సహకరించాలని రెవెన్యూ అధికారులు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాలోని పలు చోట్ల రీసర్వే గ్రామసభలు నిర్వహించి, శుక్రవారం నుంచి జరిగే కార్య క్రమంపై చర్చించారు.

బొబ్బిలి రూరల్‌, డిసెంబరు31 (ఆంధ్రజ్యోతి): రీసర్వేతో రైతుల భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆర్డీవో జేవీఎస్‌ఎస్‌ రామ్మోహనరావు తెలి పారు. బుధవారం పిరిడిలో భూముల రీసర్వేపై గ్రామసభలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రైతులు భూముల క్రయ విక్ర యాలు జరిపిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో ఆ వివరాలు నమోదు చేయించుకోవాల న్నారు. రీసర్వేలో ఉత్పన్నమయ్యే ప్రతి సమస్యను పరిష్కరించనున్నామన్నారు. కార్యక్ర మంలో డీటీ శివున్నాయుడు, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 11:59 PM