ల్యాండ్‌పూలింగ్ విధానంలో భూ సమీకరణ
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:09 AM
ల్యాండ్‌పూలింగ్ విధానంలో భూసమీ కరణ చేయడానికి సన్నహాలు చేస్తున్నామని వీఎంఆర్‌డీఏ అసిస్టెంట్ సర్వేయర్ ఖాజాబాబా తెలిపారు.భూసేకరణపైగూడెపువలస గ్రామసమీపంలో గురువారం రైతులతో ఖాజాబాబా మాట్లాడారు.
భోగాపురం, నవంబరు6(ఆంధ్రజ్యోతి): ల్యాండ్‌పూలింగ్ విధానంలో భూసమీ కరణ చేయడానికి సన్నహాలు చేస్తున్నామని వీఎంఆర్‌డీఏ అసిస్టెంట్ సర్వేయర్ ఖాజాబాబా తెలిపారు.భూసేకరణపైగూడెపువలస గ్రామసమీపంలో గురువారం రైతులతో ఖాజాబాబా మాట్లాడారు. ఈసందర్భంగా మరోసారి భూములిచ్చి మోస పోబోమని గూడెపువలస, చాకివలస గ్రామాలకు చెందిన రైతులు తేల్చిచెప్పారు. ల్యాండ్ పూలింగ్ విధానానికి సంబందించి రైతులతో మాట్లాడి నివేదిక విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్రప్రసాద్‌కు అందజేయనున్నామని చెప్పారు. ఈ మేరకు రైతులు మాట్లాడుతూ గతంలో ఇటీవల ఎయిర్‌పోర్టుకు భూములిచ్చామని కొంత మందికి పరిహారం ఇప్పటికి అందలేదన్నారు. భూములిచ్చిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగావకాశాలు ఇస్తామనిచెప్పి ఎయిర్‌పోర్టులో ఉపాధి కల్పించలేదన్నా రు. మరోసారి భూములిచ్చి మోసపోవడానికి సిద్ధంగాలేమన్నారు. అయినా గూడెపు వలసలో రైతుల వద్ద కొద్దిపాటి భూములు మాత్రమే ఉన్నాయని, అవికూడా తీసు కొంటే ఏవిధంగా జీవించగలమన్నారు. అనంతరం ఖాజాబాబా మాట్లాడుతూ ఇక్క డ జరిగిన విషయాన్ని విశాఖ కలెక్టర్‌కు నివేదించనున్నామని తెలిపారు. కార్యక్ర మంలో వీఆర్వో వాక్‌దేవి, సర్పంచ్ అయ్యప్పరెడ్డి, రైతులు కె.రాంమూర్తి పాల్గొన్నారు.