Share News

భూసేకరణ వేగవంతం చేయాలి

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:33 AM

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు అవసరమయ్యే భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

 భూసేకరణ వేగవంతం చేయాలి

-కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, అక్టో బరు 16 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు అవసరమయ్యే భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గు రువారం తోటపల్లి, నారాయణపురం, తారక రామ తీర్థసాగర్‌, మడ్డువలస, తాటిపూడి, ఆండ్రా ప్రాజెక్టులపై నీటి పారుదల అధికా రులతో గురువారం సమీక్షించారు. జిల్లాలో రూ.50 కోట్లు నిఽధులు ఉన్నాయని, సుజల స్రవంతి ప్రాజెక్టు భూసేకరణకు అవసర మయ్యే నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక అందించా లని ఆదేశించారు. తోటపల్లి ప్రాజె క్టులో గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్‌కి సంబంధించి భూసేకరణ సత్వరం పూర్తి చేయాలన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులకు అనుబంధంగా 759 ఎంఐ ట్యాంకులు ఉన్నాయని, జిల్లాలో ఆర్‌ఆర్‌లో భాగంగా చెరువులు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 40 చెక్‌ డ్యామ్‌ల పనులు 8.6 కోట్ల అంచనా వ్యయంతో జరుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ స్వర్ణకుమార్‌, ఎస్‌ఈలు ఆప్పారావు, సుధాకర్‌, ఈఈలు అప్పలనాయుడు, రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 12:33 AM