భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి
ABN , Publish Date - May 20 , 2025 | 12:11 AM
మండలంలోని కరకవలస పంచాయతీ శివారు మారిక భూములను అదాని కంపెనీకి అప్పగించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను వెనెక్కితీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ కోరారు.
వేపాడ,మే 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని కరకవలస పంచాయతీ శివారు మారిక భూములను అదాని కంపెనీకి అప్పగించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను వెనెక్కితీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ కోరారు.ఈ మేరకు సోమవారం మారిక గ్రామస్థులతో కలిసి ఇన్‌చార్జి తహసీల్దార్ కె.సన్యాసినాయుడుకి వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా గిరిజనులతోపాటు జగన్ మాట్లాడుతూ మారికలో అదాని పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ సామాజిక అధ్యయనంకోసం కలెక్టర్ ఆదేశాలమేరకు తహసీల్దార్ నోటి ఫికేషన్ జారీచేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి గిరిజనులు ప్రకృతి,అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి మా భూములను అదాని కంపెనీకి ధారాదత్తం చేయడం విరమించాలని డిమాండ్ చేశారు.