నిర్వహణ లేక నిరుపయోగం
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:56 PM
మండ లంలోని గంగచోళ్లపెంటలో పట్రువాడకు వెళ్లే రహ దారికి ఆనుకొని లక్షలాది రూపాయల వ్యయంతో నిర్వహించిన సామూహిక మరుగుదొడ్ల లక్ష్యం అట కెక్కింది. ప్రధానంగా పంచాయతీ అధికారుల పర్య వేక్షణ, నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మా రాయి. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన నిర్మూలించాలన్న లక్ష్యంతో 2019లో టీడీపీ ప్రభుత్వం వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మించాలని నిర్ణయించింది.
గజపతినగరం, డిసెంబరు31(ఆంధ్రజ్యోతి: మండ లంలోని గంగచోళ్లపెంటలో పట్రువాడకు వెళ్లే రహ దారికి ఆనుకొని లక్షలాది రూపాయల వ్యయంతో నిర్వహించిన సామూహిక మరుగుదొడ్ల లక్ష్యం అట కెక్కింది. ప్రధానంగా పంచాయతీ అధికారుల పర్య వేక్షణ, నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మా రాయి. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన నిర్మూలించాలన్న లక్ష్యంతో 2019లో టీడీపీ ప్రభుత్వం వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మించాలని నిర్ణయించింది. దీంతో గంగచోళ్లపెంటలో గ్రామానికి 300 మీటర్ల దూరంలో రూ.ఆరు లక్షల ప్రత్యేక అభి వృద్ధి నిధులతో సామూహిక మరుగుదొడ్లను నిర్మిం చారు. ప్రధానంగా రన్నింగ్ వాటర్ సదుపాయం లేదు. అలాగే విద్యుత్ కనెక్షన్ ఇచ్చినా బిల్లులు కట్టకపోవడం తదితర కారణాల వల్ల సరఫరా కావడంలేదు. దీంతో ఇక్కడ మరుగుదొడ్లు వినియోగానికి స్థానికులు ముం దుకురావడంలేదు. దీనికితోడు ఇక్కడ ప్రజలకు మరు గుదొడ్ల వినియోగంపై అవగాహన లేకపోవడంతో పాటుఆరుబయట మలవిసర్జనకే ఎక్కువగా ప్రాధా న్యం ఇస్తున్నారు.ఆరుబయట, రోడ్ల పక్కన బహిరంగ మలవిసర్జన వల్ల వాహనచోదకులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి గదులు నిరుపయోగంగా ఉండడంతో శిథిలావస్థకు చేరుతున్నా యి. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి ఇక్కడ నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను విని యోగంలోకి తీసుకురావాలని గంగచోళ్లపెంట గ్రామ స్థులు కోరుతున్నారు.