లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:46 PM
నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని, స్కీం వర్కర్లు కనీస వేతనాలు రూ.26 వేలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, ప్రధాన కార్యదర్శి వై.మన్మఽథరా వు, బి.అమరవేణి డిమాండ్ చేశారు.
పాలకొండ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని, స్కీం వర్కర్లు కనీస వేతనాలు రూ.26 వేలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, ప్రధాన కార్యదర్శి వై.మన్మఽథరా వు, బి.అమరవేణి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని పాతబస్టాండ్ ఆవరణలో జీపుయాత్ర ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాలు, వామపక్ష నేతలు బంటు దాసు, తిరుపతిరావు, వై.మన్మఽథరావు, ఇందిర, జ్యోతి, గౌరీశ్వరి, హిమప్రభ, రాము, ఖండాపు ప్రసాదరావు పేర్కొన్నారు.
ఫగుమ్మలక్ష్మీపురం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి):గుమ్మలక్ష్మీపురంలో సీఐటీయూ ఆధ్వర్యంలో జీపుయాత్ర ప్రారంభమైంది. అనంతరం ఎల్విన్‌పేట నుంచి వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మండంగి రమణ, దావాల రమణారావు, వై.మన్మఽథరావు, జ్యోతి పాల్గొన్నారు.
ఫసీతంపేట రూరల్,జూన్ 25(ఆంధ్రజ్యోతి):సీతంపేటలో జీపుయాత్ర నిర్వ హించారు.సీఐటీయూ నాయకులు దావాల రమణారావు, వై.మన్మఽథరావు, వి.ఇం దిర, కె.రాము, ఎన్ .హిమప్రభ, కె.గౌరి,జ్యోతి పాల్గొన్నారు.
ఫ భామిని, జూన్ 25 (ఆంధ్రజ్యోతి):కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రతిఘటించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు పిలుపునిచ్చారు. బుధవారం భామిని జీపు జాతచేరింది.