KPI Update కేపీఐ అప్‌డేట్ పూర్తి కావాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:08 AM
KPI Update Must Be Completed జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్(కేపీఐ)లను ఈ నెల 25లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్(కేపీఐ)లను ఈ నెల 25లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ ప్రతి జిల్లా అధికారి లాగిన్‌లో ఆయా శాఖలకు చెందిన త్రైమాసిక, వార్షిక లక్ష్యాలు, ప్రగతిని సోమవారంలోగా నమోదు చేయాలి. లక్ష్యాలు అందుబాటులో లేనివారు సంబంధిత హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌ల వద్ద నుంచి తీసుకొని నమోదు చేయాలి. మండలాలకు చెందిన డేటా ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో అధికారులు నిశితంగా పరిశీలించాలి. ఎక్కడా ఎటువంటి తప్పులకు తావివ్వరాదు. లక్ష్యాలు, ప్రగతి వివరాలు, డేటా నమోదుకు రెండు రోజులు సమయం మాత్రమే ఉన్నందున ఆదివారం కూడా సిబ్బందితో ఈ పని చేయించాలి.’ అని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ శోభిక, డీఆర్వో హేమలత, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.