Kotadurgamma తెరచాటుకు కోటదుర్గమ్మ
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:29 PM
Kotadurgamma Behind the Curtain ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ ఆలయం దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. దీనిలో భాగంగానే సోమవారం సంప్రోక్షణ అనంతరం అమ్మవారు తెరచాటుకు వెళ్లింది. ఈ నెల 22న తిరిగి అమ్మవారు భక్తులకు నిజరూప దర్శనం ఇవ్వనుంది.
పాలకొండ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ ఆలయం దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. దీనిలో భాగంగానే సోమవారం సంప్రోక్షణ అనంతరం అమ్మవారు తెరచాటుకు వెళ్లింది. ఈ నెల 22న తిరిగి అమ్మవారు భక్తులకు నిజరూప దర్శనం ఇవ్వనుంది. అక్టోబరు 2 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. కాగా ప్రస్తుతం ఆలయంలో ఉన్న ఉత్సవ విగ్రహం ద్వారానే అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఈవో వీవీ సూర్యనారాయణ, ప్రధాన అర్చకుడు డి. లక్ష్మీ ప్రసాదశర్మ తెలిపారు.