Goddess Gayatri గాయత్రీదేవిగా కోటదుర్గమ్మ
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:20 AM
Kotadurgamma as Goddess Gayatri శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండో రోజు మంగళవారం పాలకొండ కోటదుర్గమ్మ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. తొలుత ఆలయ ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీప్రసాదశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.
పాలకొండ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండో రోజు మంగళవారం పాలకొండ కోటదుర్గమ్మ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. తొలుత ఆలయ ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీప్రసాదశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన ప్రజలు క్యూలైన్లలో బారులుదీరారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పులకించిపోయారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు చేశారు. ఎవరికీ ఎటువంటి కలగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. జిల్లా దేవదాయశాఖాధికారి రాజారావు, ఈవో వీవీ సూర్యనారాయణ ఉత్సవాలను పర్యవేక్షించారు.