Share News

Saraswati సరస్వతీ దేవిగా కోటదుర్గమ్మ

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:21 PM

Kota Durgamma as Goddess Saraswati శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ సోమవారం భక్తులకు సరస్వతీ దేవిగా దర్శనమిచ్చింది. పరిసర ప్రాంత భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కొందరు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

 Saraswati  సరస్వతీ దేవిగా కోటదుర్గమ్మ
సరస్వతీ దేవి అలంకరణలో కోటదుర్గమ్మ

పాలకొండ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ సోమవారం భక్తులకు సరస్వతీ దేవిగా దర్శనమిచ్చింది. పరిసర ప్రాంత భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కొందరు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయ ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీ ప్రసాద్‌ఽశర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు, కుంకుమపూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు రెండు వందల మంది చిన్నా రులు తమ తల్లిదండ్రులతో పాల్గొనగా.. వారికి ఆలయ సిబ్బంది పెన్ను, పుస్తకాలు అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ అన్ని ఏర్పాట్లు చేశారు.

జ్ఞాన సరస్వతి ఆలయంలో...

విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం నుంచి సామూహిక అక్షరాభ్యాసాలు వైభవంగా జరిగాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి కూడా పిల్లలను తీసుకుని వచ్చారు. అర్చకుడు ఫణిహారం తాతాచార్యులు తొలుత శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శారదా సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం, మంచినీరు, పిల్లలకు పాలు అందించారు.

Updated Date - Sep 29 , 2025 | 11:21 PM