ఘనంగా కోడూరు మాత యాత్ర
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:01 AM
మండలంలో కోడూరులో వెలసిన కోడూ రుమాత యాత్ర ఘనంగా జరిగింది. ప్రతి ఏటా సెప్టెంబరు రెండో శనివారం ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విశాఖ పీఠాధిపతులు ఫాదర్ డాక్టర్ ఉడమల బాలా, కోడూరు మాత చర్చి ఫాదర్ యుగలకుమార్ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. సీఐ నారాయణరావు అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.
బాడంగి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): మండలంలో కోడూరులో వెలసిన కోడూ రుమాత యాత్ర ఘనంగా జరిగింది. ప్రతి ఏటా సెప్టెంబరు రెండో శనివారం ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విశాఖ పీఠాధిపతులు ఫాదర్ డాక్టర్ ఉడమల బాలా, కోడూరు మాత చర్చి ఫాదర్ యుగలకుమార్ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. సీఐ నారాయణరావు అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఎస్‌ఐలు తారకేశ్వరరావు, ఆర్.జయంతి, వెలమల ప్రసాద్‌తోపాటు 70 మందిసిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. విజయనగరంతోపాటు పార్వతీపురం, శ్రీకాకు ళం, విశాఖ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కోడూరు మాతను దర్శించుకుని ముడుపులు చెల్లించారు.ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు, ఆటోల కోసం సీఐ నారాయణరావు వన్‌వే ట్రాఫిక్ ఏర్పాటుచేయడానికి చర్యలుతీసుకున్నారు. దీంతో భక్తులు రద్దీ లేకుండా ప్రార్థనామందిరానికి చేరుకొని ప్రార్థనలుచేసుకొని ఎటువంటి అసౌకర్యం లేకుండా వన్‌వే ద్వారా వారి వారి స్వగ్రామాలకు సురక్షితంగా చేరుకున్నారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరిగినట్టు చర్చి ఫాదర్లు తెలిపారు.