Share News

Reading పఠనంతో విజ్ఞానం

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:32 PM

Knowledge Through Reading పుస్తక పఠనంతో ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. అక్షర జ్ఞానంతో పాటు భాష, సాహిత్యంపై మక్కువ ఏర్పడుతుంది. భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. గ్రంథాయాల్లో పఠించి ప్రభుత్వ కొలువులు సాధించిన వారెందరో ఉన్నారు.

  Reading పఠనంతో విజ్ఞానం
పాచిపెంట శాఖాగ్రంథాలయంలో యువతకు అందుబాటులో ఉన్న పుస్తకాలు

భాష, సాహిత్యంపైనా పట్టు

నేడు జాతీయ పఠన దినోత్సవం

సాలూరు రూరల్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): పుస్తక పఠనంతో ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. అక్షర జ్ఞానంతో పాటు భాష, సాహిత్యంపై మక్కువ ఏర్పడుతుంది. భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. గ్రంథాయాల్లో పఠించి ప్రభుత్వ కొలువులు సాధించిన వారెందరో ఉన్నారు. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో యువతకు పఠనాసక్తి పెంపొందిం చడంలో గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న 40 శాఖ గ్రంథాలయాల్లో రోజుకు 4వేల మంది వివిధ పుస్తకాలు, పత్రికలు పఠిస్తున్నారు. విజ్ఞానంతో పాటు సామాజిక అభివృద్ధికి పుస్తక, పత్రికల పఠనం ఎంతగానో దోహదపడుతుందని పలువురి అభిప్రాయం. అయితే నేటి డిజిటల్‌ యుగంలో గ్రంథాలయాలకు వచ్చేవారి సంఖ్య తగ్గుతోంది. నేటి తరం పూర్తిగా సెల్‌ఫోన్లు, కంప్యూటర్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్‌ పఠనం సైతం ప్రోత్సహించాలని కేంద్రప్రభుత్వం పిలుపునిచ్చింది. పఠనాసక్తిని పెంపొందించడానికి స్వచ్ఛంద సంస్థలు , ప్రజలు సహకారమందిస్తే సత్ఫలితాలు సాధించొచ్చని పలువురు భావిస్తున్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:32 PM