Share News

విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:21 AM

విద్యా విజ్ఞాన ప్రదర్శనకు వెళ్లే విద్యార్థులు తమ విజ్ఞా నాన్ని మరింత పెంపొందించుకోవాలని కలెక్టర్‌ ఎ.శ్యా మ్‌ప్రసాద్‌ అన్నారు.

విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

బెలగాం/ పార్వతీపురం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): విద్యా విజ్ఞాన ప్రదర్శనకు వెళ్లే విద్యార్థులు తమ విజ్ఞా నాన్ని మరింత పెంపొందించుకోవాలని కలెక్టర్‌ ఎ.శ్యా మ్‌ప్రసాద్‌ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శ నకు బయలుదేరిన విద్యార్థుల బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో జిల్లాలో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన ఈ విద్యా ర్థులందరూ విశాఖపట్నంలోని కంచరపాలెంలో గల పాలిటెక్నిక్‌ కళాశాల, ఆర్‌కే బీచ్‌ వద్ద గల ఐఎన్‌ఎస్‌ కుర్బురా సబ్‌ మెరైన్‌ మ్యూజియం, ఎయిర్‌ క్రాప్ట్‌ మ్యూజియం, ఆర్కియా లజీ మ్యూజియంలను సందర్శిస్తారని కలెక్టర్‌ తెలిపారు. మండలానికి మూడు పాఠశాలల చొప్పున జిల్లాలోని 15 మండలాల నుంచి 45 మంది విద్యార్థులు ఈ విద్యా విజ్ఞానిక ప్రదర్శనకు బయలుదేరినట్లు డీఈవో డా.ఎన్‌.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 12:21 AM