కార్మిక చట్టాలపై అవగాహన అవసరం
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:11 AM
అసంఘటితరంగ కార్మికులకు చట్టాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని రెండో అదనపు జిల్లా న్యాయాధికారి, మండల న్యాయ సేవా కమిటీ అధ్యక్షుడు ఎస్.దామోదరరావు తెలిపారు.
బెలగాం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : అసంఘటితరంగ కార్మికులకు చట్టాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని రెండో అదనపు జిల్లా న్యాయాధికారి, మండల న్యాయ సేవా కమిటీ అధ్యక్షుడు ఎస్.దామోదరరావు తెలిపారు. శనివారం పార్వతీపురంలోని కోర్టు ప్రాంగణంలో అసంఘటిత కార్మికులకు పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టాలు, ఈ-శ్రమ కార్డ్ ప్రయోజనాలు, పీఎం శ్రమ యోగి మాన్-ధన్ పెన్షన్ పథకాలు, జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ అందించే న్యాయ సలహాలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పి.సువర్ణ, అధికారి బి.కొండలరావు, లోక్ అదాలత్ సభ్యులు టి.జోగారావు పాల్గొన్నారు.
సబ్ జైలు పరిశీలన
జైలులో ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేసుకోవాలని అదనపు న్యాయాధికారి, పస్ట్ క్లాస్ మెజిస్ర్టేట్ సౌమ్య జోసెఫిన్ తెలిపారు. శనివారం పార్వతీపురం సబ్‌జైల్‌లో వసతులను పరిశీలించారు. ఖైదీలతో ముఖాముఖి మాట్లాడారు. జైలు లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను తనిఖీ చేశారు. జైలులోని పలు విభాగాలను తనిఖీ చేశారు. ఖైదీల ఆరోగ్యంకోసం తీసుకుంటున్న చర్యలను న్యాయాధికారి సబ్ జైల్ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు.