Share News

Consumer Rights వినియోగదారుల హక్కులను తెలుసుకోవాలి

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:38 PM

Know Your Consumer Rights ప్రతి పౌరుడు విధిగా వినియోగదారుల హక్కులు గురించి తెలుసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి సూచించారు. జాతీయ విని యోగదారుల దినోత్సవం నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీ క్షించారు.

 Consumer Rights వినియోగదారుల హక్కులను తెలుసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ

పార్వతీపురం, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): ప్రతి పౌరుడు విధిగా వినియోగదారుల హక్కులు గురించి తెలుసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి సూచించారు. జాతీయ విని యోగదారుల దినోత్సవం నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. నాణ్యత లేని వస్తువులు లేదా సేవలు వల్ల ఎవరైనా మోసపోతే తక్షణమే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. చట్టం వినియోగదారులకు కవచం వంటిది. వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, రక్షణ చట్టం-2019లోని ముఖ్యాంశాలపై వృక్తత్వ పోటీలు, క్విజ్‌ కార్యక్రమాలు నిర్వహించాలి. అవగాహన స్టాల్స్‌ ఏర్పాటు చేయాలి. జిల్లా వినియోగదారులు ఫోరంలో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలి. ఈ వారోత్సవాల ద్వారా వినియోగదారుల్లో మార్పు కనిపించాలి.’ అని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బి.అశోక్‌, వాణిజ్య పన్నులశాఖ సహాయ కమిషనర్‌ వి.గజలక్ష్మి, లీగల్‌ మెట్రాలజీ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ పి.వి.రంగారెడ్డి, డీఐఈవో వై.నాగేశ్వరరావు, డీఈవో పి.బ్రహ్మాజీరావు తదితరులు పాల్గొన్నారు.

పద్ధతులు మార్చుకోకుంటే లైసెన్స్‌ రద్దు

‘జిల్లాలోని వినియోగదారుల ఇంటి వద్దకే ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లను డెలివరీ చేయాలి. చార్జీలను వసూలు చేస్తే ఉపేక్షించం. ఇకపై పద్ధతులు మార్చుకోవాలని, లేకుంటే లైసెన్స్‌లు రద్దు చేస్తాం.’ అని జేసీ హెచ్చరించారు. గ్యాస్‌ డీలర్లతో ఆయన మాట్లాడుతూ.. సిలిండర్ల పంపిణీలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఉజ్వల లబ్ధిదారులకు సకాలంలో సేవలందించాలని సూచించారు. రికార్డులు, నిల్వలు పక్కాగా ఉండాలని లేదంటే చర్యలు తప్పవన్నారు.

పారదర్శకంగా సరుకుల పంపిణీ

రేషన్‌ డిపోల ద్వారా పారదర్శకంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని జేసీ ఆదేశించారు. కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా చూడాలన్నారు. డిపోల్లో సరుకులన్నీ అందుబాటులో ఉంచాలని డీలర్లకు సూచించారు. ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ ద్వారా కార్డుదారులు నుంచి స్పందన తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో ఎటువంటి ఫిర్యాదులు అందకుండా సేవలు అందించాలన్నారు. షాపుల వద్ద సరుకుల ధరలను తెలియజేసే బోర్డు పెట్టాలని జేసీ ఆదేశిం చారు. రోజువారీ మార్కెట్‌ పర్యవేక్షణ ఉండాలన్నారు. కృత్రిమ కొరత లేకుండా చూడాలన్నారు. కలెక్టరేట్‌లో ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ధరలు, తూనిక, కొలతల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Dec 12 , 2025 | 11:38 PM